ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 2: ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) ప్రమోషన్లలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ప్రొఫెసర్లు చేస్తున్న నిరసనలు మంగళవారంతో 63వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా బోటనీ, జువాలజీ విభాగాల ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో ప్రొఫెసర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ అర్హులకు ప్రమోషన్ నిరాకరించి, తన అడుగులకు మడుగులొత్తేవారికే పదవులు, ప్రమోషన్లు వస్తాయని పరోక్షంగా చెబుతున్నారని దుయ్యట్టారు.
రెండు నెలలుగా అధ్యాపకులు నిరంతరంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినైట్లెనా లేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామన్నారు. ప్రొఫెసర్ రాంచందర్, ప్రొఫెసర్ గంగాధర్, ప్రొఫెసర్ కమలాకర్, డాక్టర్ వెంకట్‌దాస్, డాక్టర్ నతానియల్, డాక్టర్ సుజాత, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రమేశ్, డాక్టర్ రమేశ్‌బాబు, అపర్ణ, మాధురి పాల్గొన్నారు.