ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల ఇంటర్నల్, ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీలోగా నిర్వహించాలని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ తదితర అన్ని కోర్సుల మూడు, అయిదో సెమిస్టర్ రెండవ ఇంటర్నల్ పరీక్షలతో పాటు ప్రాక్టికల్, ప్రాజెక్ట్, వైవా పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలని సూచించారు.
వచ్చే నెల 6వ తేదీ సాయంత్రం అయిదు గంటలలోగా ప్రాక్టికల్ మార్కుల జాబితాను ఓయూ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ఆ తరువాత కళాశాల లాగిన్ ముగిసిపోతోందని చెప్పారు. ఏవైనా సందేహాలుంటే టెక్నికల్ సపోర్ట్ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.