వ్యవసాయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 5 : విద్యార్థినులు అన్ని రంగాలలో పురుషులకు దీటుగా రాణిస్తున్నారని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యసాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ అనారు. ఆదివారం యూనివర్సిటీ పరిధిలోని స్టేడియంలో రెండో రోజు నిర్వహిస్తున్న క్రీడలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొనడం అభినంద నీయమన్నారు. క్రీడలు మానసిక వికాసానికి తోడ్పాడుతాయన్నారు.
యూనివర్సిటీ డీఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులు మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు. డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా. సీమ మాట్లాడుతూ విలువలు, ప్రమాణాలను కళాశాలల నుంచే నేర్చుకునుటకు అవకాశాలున్నాయన్నారు. చిన్న కుటుంబ వ్యవస్థలలో కేవలం కళాశాలల ద్వారానే ఉత్తమ అలవాట్లు నేర్చుకునేందుకు వీలవుతుందన్నారు. యూనివర్సిటీ పరిశోధన సంచాలకుడు డా. జగదీశ్వర్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సర్వసాధారణమని అన్నారు. కార్యక్రమంలో డీన్ ఆఫ్ పీజీ డా. అనిత, డీన్ డా. రత్నకుమారి, నరేంద్రరెడ్డి, పరిశీలకులు డా. విద్యాసాగర్, రాజేంద్రనగర్ రవీంద్రనాయక్ ఇతర కళాశాలల ఓఎస్ఎలు, పీడీలు పాల్గొన్నారు.