నత్తకు నడక నేర్పేలా.. క్రమబద్ధీకరణ
నత్తకు నడక నేర్పేలా హెచ్ఎండీఏలో ఎల్లారెస్ క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రభుత్వానికి ఆదాయం.. ప్లాట్ల యజమానులకు ఎంతో ఊరట కలిగించే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల అంశం క్రమబద్ధీకరణలో నత్తనడకన సాగుతోంది.
- హెచ్ఎండీఏలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్థితిగతులు
- లక్ష్యం నిర్ణయించినా వేగవంతం కానీ క్రమబద్ధీకరణ ప్రక్రియ
- ప్లానింగ్ విభాగంపై పని భారం.. కార్యాచరణలో తీవ్ర జాప్యం
సిటీబ్యూరో, జూన్ 11(నమస్తే తెలంగాణ): నత్తకు నడక నేర్పేలా హెచ్ఎండీఏలో ఎల్లారెస్ క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రభుత్వానికి ఆదాయం.. ప్లాట్ల యజమానులకు ఎంతో ఊరట కలిగించే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల అంశం క్రమబద్ధీకరణలో నత్తనడకన సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఫిబ్రవరిలోనే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిశీలించి, మార్చి 31 నాటికి క్రమబద్ధీకరణ పూర్తి చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించింది. మార్చి గడిచిపోయి రెండు నెలలు అవుతున్నా… ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ అన్న చందంగా ఉంది. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల నుంచి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో 3.4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రణాళికా విభాగంలో తక్కువ సిబ్బంది ఉండటంతో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా చేయలేకపోతున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరణ చేస్తే ఫీజుల రూపంలో సుమారు రూ.450 కోట్ల మేర ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా వేశారు. నాలుగు జోన్లుగా విస్తరించిన హెచ్ఎండీఏ పరిధి 25-30 కి.మీ వరకు ఉండటంతో ఆయా ప్రాంతాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో లే అవుట్లను, ప్లాట్లను పరిశీలించాలంటే తగిన సిబ్బంది అందుబాటులో లేరని, అందుబాటులో ఉన్న సిబ్బందితో చేస్తుండటంతో చాలా తక్కువ సంఖ్యలో ప్లాట్ల క్రమబద్ధీకరణ జరుగుతోందని ప్లానింగ్ విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు.
ప్లానింగ్‌లో పని భారం..
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి దాటిన తర్వాత విస్తరించి ఉన్న హెచ్ఎండీఏలోని శివారు ప్రాంతాల్లో కొత్తగా పట్టణీకరణ శరవేగంగా చోటు చేసుకుంటోంది. ఈ ప్రాంతాల్లో కొత్తగా భవన నిర్మాణాల అనుమతులు, లే అవుట్ల అనుమతులు ఇవ్వడానికి చాలా సమయం పడుతోంది. ప్లానింగ్ విభాగంలో గతంతో పోల్చితే ఇప్పుడు పని భారం చాలా ఎక్కువగా ఉందని, దానికి సరిపడా నైపుణ్యం కలిగిన ప్లానింగ్ సిబ్బంది లేకపోవడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయకపోతున్నామనే అభిప్రాయాన్ని ప్లానింగ్ విభాగం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పూర్తి చేసిన విషయాన్ని అధికారులు ప్రభుత్వానికి విన్నవించినా, సిబ్బందిని పెంచడం లేదు. తక్కువ సిబ్బంది ఉండటం వల్లే వేగవంతంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయలేకపోతున్నామని, ఈ విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్లానింగ్ విభాగం అధికారులు పేర్కొంటున్నారు.
లక్షల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు..
గ్రేటర్ హైదరాబాద్ తర్వాత ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో భారీ సంఖ్యలోనే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఏడు జిల్లాల్లో విస్తరించిన ఉన్న హెచ్ఎండీఏ పరిధిలోని 47 మునిసిపాలిటీలను మినహాయిస్తే, మిగతా ప్రాంతాల్లోంచి వచ్చిన దరఖాస్తులే 3,44,726 వరకు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 60 వేల దరఖాస్తులను హెచ్ఎండీఏ అధికారులు జోన్ల వారీగా పరిశీలించారు. మిగతా వాటిని పరిశీలన చేయాలంటే తగినంత సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ విషయంలో అధికారుల్లో అయోమయం నెలకొంది. ప్రధానంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలంటే నిపుణులైన ప్లానింగ్ సిబ్బంది చాలా కీలకం. ప్రస్తుతం, హెచ్ఎండీఏతో సిబ్బంది అందుబాటులో లేదని, అలాంటి పరిస్థితుల్లో లక్షలాది దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయడం అసాధ్యమనే అభిప్రాయాన్ని ప్లానింగ్ విభాగం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

