వ్యవసాయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 13: దేశ జనాభా పెరుగుదల కనుగుణంగా, భవిషత్ తరాలకు అవసరమైయ్యేలా పౌల్టీన్రీ పెం చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐసీఏఆర్ -పౌల్టీ్ర రీసెర్చ్ న్యూఢిల్లీ డీడీజీ డా. రాఘవేం ద్ర భట్టు అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఐసీఏఆర్-డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ప్రధాన కార్యాలయం సమావేశపు మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు రాఘవేంద్ర భట్టు ముఖ్య అతిథిగా పా ల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా గుర్తింపు గల హైదరాబాద్ పౌల్టీ్ర కేంద్రం 50 వసంతాల సందర్భంగా, అనేక మార్పులకు నాంది గా నిలిచిందన్నారు. దేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పౌల్ట్రీ పరిశ్రమలో మార్పులు తీసుకు రావడంలో శాస్త్ర, పరిశోధన, విద్యా, విస్తరణలో విప్లవాత్మక మార్పు తీసుకు రావడంలో మనందరి కృషి ఉందని గుర్తుచేశారు.
రానున్న తరాలకు నాణ్యత గల పౌల్ట్రీ కొరకు మరిన్ని పరిశోధనలు అవసరమన్నారు. దక్షిణ భారతంలో ప్రధానంగా హైదరాబాద్ పౌల్ట్రీ పరిశోధనలకు కేంద్రంగా నిలిచిందన్నారు. దేశంలో పలు చో ట్ల పౌల్ట్రీ నష్టాల బారిన పడ్డ వెంటనే పునరాలోచించి , ఎందుకు జరిగాయే ఇక్కడ పరిశోధనలు జరిగి ప్రత్యామ్నాయ కనుగొన్నారని పేర్కొన్నారు. పౌల్ట్రీ ద్వారా ప్రత్యక్ష, పరోక్షం గా లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నారని గుర్తుచేశారు. పౌల్ట్రీ ద్వారా ఎగుమతులకు మంచి అవకాశం ఉందన్నారు. దేశంలో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో అధిక శాతం వ్యవసాయ, ఇంటి వద్దే కాకుండా ప్రరిశ్రమలుగా వెలిశాయన్నారు. ప్రధానంగా పౌల్ట్రీ అధికంగా పెంచే అవకాశాలున్నాయన్నారు.
దేశంలోని ఎఐసీఆర్పీ సెంటర్స్ కేవీఏఎఫ్ఎస్యూ బెం గళూర్, జీఏడీవీఏఎస్యూ లుద్ధీనా, ఓయూఏటీ భువనేశ్వర్, బీఏయూ రాంచి, ఎంపీయూఏటీ ఉదయ్‌పూర్, బీఏఎస్యూ పాట్న, ఐసీఏఎన్ఓఎఫ్ఆర్ఐ సిక్కిం, ఐసీఏఆర్ సీసీఏఆర్‌ఐ గోవా, డబ్య్లూబీయూఏఎఫ్ ఎస్ కోల్‌కత్తాతో పాటు మొత్తం 24 సెంటర్లలో ఎప్పటికప్పుడు పరిశోధనలు జరిగాయన్నారు. ఈ సెంటర్లు పౌల్ట్రీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయన్నారు. ప్రతి ఏడాది 12,330 రైతు కు టుంబాలు కోళ్ల పెంపకం ద్వారా లబ్ధి పొందుతున్నాయన్నారు. ప్రతి ఏడాది 32 మిలియన్ల గుడ్లు విక్రయిస్తున్నారని సూచించారు. మం చి నాణ్యత గల వాటిని పెంచి ఎగుమతులు చేపడితే మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయన్నారు.
రాజేంద్రనగర్ రీసెర్చ్ కేంద్రం డైరెక్టర్ డా. ఆర్.ఎన్, చట్టర్జీ, పౌల్ట్రీ బ్రీడింగ్ విభాగం ఏజీబీ హెడ్ డా. రాజ్ కుమార్ మా ట్లాడుతూ, కరోనా వంటి గడ్డు కాలంలో కూ డా గుడ్డుకు అధిక ప్రాధాన్యత ఉన్నదన్నారు. రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా సంచాలనాల యం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో గుడ్లు, మాంసం కొరకు విడుదల చేసిన శ్రీనిధి, పెర టి దొడ్లలో పెంచడానికి వనరాజ, రంగురంగుల బ్రాయిలర్ కోడిగా కృషిబ్రో, పెరటిలోనే అధిక గుడ్ల ఉత్పత్తి దేశీయ కోళ్లుగా ఏడాదికి అధిక గుడ్లు వనశ్రీ, ఐదు నెలల్లో ఏడాదికి అధి క గుడ్లు పెట్టే అసీల్, కడక్‌నాధ్, ఘాగస్, నికోభరి రకాలను విడుదల చేశారన్నారు. కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ఆర్పీ శర్మ, డా.ప్రసాద్, రాజశేఖర్ రెడ్డి, మైపాల్ రె డ్డి, డా.ప్రకాశ్ పాల్గొని పలు సూచనలు చేశా రు. ప్రతినిధులు, రైతులు, శాస్తవ్రేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని సుదీర్ఘ చర్చ జరిపారు.