నడిరోడ్డుపై మైనర్ల బీభత్సం
మధురానగర్‌లోని కార్మికనగర్‌లో ఇటీవల ఒక ఇంటర్ విద్యార్థి నిర్లక్ష్యంగా కారు నడిపి బీభత్సం సృష్టించాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా కారు అద్దెకు తీసుకున్న సదరు మైనర్ వచ్చీరాని డ్రైవింగ్‌తో కారును వేగంగా నడిపి 7 బైకులను ధ్వంసం చేశాడు. మరో బైక్‌ను ఈడ్చుకెళ్లడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరు చనిపోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందారు.
- ఏటా పెరిగిపోతున్న మైనర్ డ్రైవింగ్ కేసులు
- పోలీసులు హెచ్చరిస్తున్నా వినిపించుకోని వైనం
- ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజలు
మధురానగర్‌లోని కార్మికనగర్‌లో ఇటీవల ఒక ఇంటర్ విద్యార్థి నిర్లక్ష్యంగా కారు నడిపి బీభత్సం సృష్టించాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా కారు అద్దెకు తీసుకున్న సదరు మైనర్ వచ్చీరాని డ్రైవింగ్‌తో కారును వేగంగా నడిపి 7 బైకులను ధ్వంసం చేశాడు. మరో బైక్‌ను ఈడ్చుకెళ్లడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరు చనిపోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందారు.
ఇటీవల ఒక ఎస్సై తన మనుమరాలితో కారు నడిపించడం సంచలనం సృష్టించింది. ఇది గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరలైయ్యింది. దీనిపై పోలీసు బాస్ సీరియస్‌గా స్పందించి అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు.
మరోకేసులో అంబర్‌పేటకు చెందిన ఓ బాలుడు టూవీలర్‌పై వేగంగా వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బండి చేతికి ఇవ్వకుండా ఉంటే మా బిడ్డ బతికేవాడు కదా అంటూ ఆ సమయంలో బాలుడి తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది.
సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : నగరంలో మైనర్లు డ్రైవింగ్‌తో బీభత్సం సృష్టిస్తున్నారు. విచ్చలవిడిగా వాహనాలు నడపడంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వచ్చి రాని డ్రైవింగ్‌తో బైక్‌లు, కార్లను వేగంగా నడపడంతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ట్యాంక్‌బండ్ రోడ్డు, స్టీల్బ్రిడ్జిపైన రాత్రివేళలో స్టంట్లు చేస్తూ విర్రవీగిపోతున్నారు. మద్యం మత్తులో రాంగ్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లు చేయడంతో అమాయకులు బలి అవుతున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్న డోంట్ కేర్ అంటూ రెచ్చిపోతున్నారు.
ఇటీవల మధురానగర్‌లో ఇంటర్ విద్యార్థి నిర్లక్ష్యంగా కారు నడిపి ఏడు బైక్‌లను ధ్వంసం చేశారు. ఒకరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అంబర్‌పేటలో మైనర్ టూవీలర్ పై వేగంగా వెళ్తూ స్తంభాన్ని ఢీకొనడంతో చనిపోయాడు. ఇలా నగరంలో నిత్యం మైనర్లు ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఏటా మైనర్ డ్రైవింగ్ కేసులు పెరిగిపోతున్నా మారడం లేదని పోలీసులు చెబుతున్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. 18ఏళ్లు నిండని పిల్లలు విచ్చలవిడిగా వాహనాలు నడుపుతుండటం వలన వారితో పాటు రోడ్డుపై వెళ్తున్న అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే ఈ సం వత్సరం ఇప్పటివరకు సుమారు 5వేలకు పైగా కేసులు నమోదైనట్లు అధికారిక అంచనా.
ఇదే కమిషనరేట్‌లో 2024లో 3,283 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదవగా, 2025 నాటికి ఈ సంఖ్య 7,808కి పెరిగింది. గ్రేటర్ పరిధిలో గత రెండేళ్లలో 4,170 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ డ్రైవింగ్ కేసుల్లో వాహన యజమానులు లేదా తల్లిదండ్రులపై మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 199(ఏ)కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఉల్లంఘనకు తల్లిదండ్రులకు రూ.25వేల జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అలాగే సదరు వాహనం ఆర్సీని 12 నెలల పాటు రద్దుచేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మైనర్ల తీరులో రాని మార్పు..
ఎంతమంది ప్రాణాలు పోతున్నా, పోలీసులు కఠినంగా హెచ్చరిస్తున్నా కొందరు మైనర్లలో మాత్రం మార్పు రావడం లేదు. హైదరాబాద్‌లోని నాంపల్లి, లక్డీకాపూల్, లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్డు, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ పార్క్ తదితర ప్రాంతా ల్లో నిత్యం ఒకే వాహనంపై నలుగురు లేదా ఐదుగురు ప్రయాణించడం, బైక్‌పై విన్యాసాలు చేయడం సర్వ సాధారణం అయిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
ఈనె 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మైన ర్ డ్రైవింగ్‌కు సంబంధించి 334 కేసులు నమోదయ్యాయి. ఫ్రీలెఫ్ట్ ఉల్లంఘనలు 1,015 నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మైనర్లను వాహనాలు నడపడానికి అనుమతించవద్దని, ముఖ్యంగా వాహన యజమానులు, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలిస్తే పోలీసుల తనిఖీల్లో పట్టుబడినప్పుడు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసు విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

