హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఖజాగూడలో ఉన్న దీ కేవ్ పఫ్ క్లబ్లో డ్రగ్స్ (Drugs) కలకలం రేపింది. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారనే సమాచారంతో రాయదుర్గం పోలీసులు, నార్కొటిక్ బ్యూరో అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుని వారికి పరీక్షలు నిర్వహించారు. అందులో 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. దీంతో అందరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టబడ్డవారిలో పబ్ నిర్వాహకులు, డీజే ఆపరేటర్లు ఉన్నారు.
ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాలు సేవించిన ఆనవాళ్లు లభించాయి. డీజే ఆపరేటర్‌తో కలిసి పబ్ నిర్వాహకులు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించారు. అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అదుపులోకి తీసుకున్నవారిని నేడు కోర్టులో హాజరుపరుచనున్నారు.