మైలార్ దేవ్ పల్లి : మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. 9మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని తొమ్మిది సెల్ ఫోన్లు, రూ.45,000 డబ్బులను సీజ్ చేసి మైలార్ దేవ్ పల్లి పోలీసులకు అప్పగించారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత పేకాట, డ్రగ్స్ వంటి దురాగాతాలకు దూరంగా ఉండాలని సూచించారు.