Youtube Prank Videos | ఓ యూట్యూబరా.. చేయొద్దు బకరా..! ప్రాంక్‌తో పరేషాన్..!
Youtube Prank Videos | దేశ వ్యాప్తంగా ప్రాంక్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ధోరణీ మంచిది కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- హద్దు మీరుతున్న ఎగతాళి ఆటలు
- వ్యూస్, యాడ్స్ కోసం యూట్యూబర్ల వికృత పోకడ
- నగర రోడ్లపై అమ్మాయిలను ఆటపట్టిస్తూ రాక్షసానందం
- ప్రాంక్‌తో ఇబ్బందికి గురిచేస్తే ఫిర్యాదు చేయాలంటంటున్న పోలీసులు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 ( నమస్తే తెలంగాణ ) : ” నలుగురు అమ్మాయిలు గోల్కొండ కోటను వీక్షిస్తున్నారు. కోటపైకి ఎక్కి పరిశీలిస్తున్నారు. వాళ్లకు ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి ఒక్కసారిగా వారిని నెట్టివేయడానికి ప్రయత్నించాడు. ఎవరో సైకో అనుకుని ఆ అమ్మాయిలు తలో దిక్కు పరుగెత్తడానికి ప్రయత్నించారు. ఇంతలో ఆ వ్యక్తి అరుస్తూ.. మేడం ఇది ప్రాంక్. అదిగో చూడండి అక్కడ కెమెరా ఉంది. అంటూ వారికి చెప్పాడు. ఆ అమ్మాయిలో ఇద్దరు ఆ ప్రాంక్‌ను సింపుల్‌గా తీసుకున్నారు.. మరో ఇద్దరు వారిపై సీరియస్ అయ్యారు. ఇలాంటి ప్రాంక్ వీడియోలు షూట్ చేసే ట్రెండ్ నగరంలో పెరిగిపోతుంది. దేశ వ్యాప్తంగా ప్రాంక్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ధోరణీ మంచిది కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల హైదరాబాద్ పోలీసులు ప్రాంక్ క్రియేటర్స్‌కు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ప్రాంక్‌తో వికృత పోకడ..!!
ప్రాంక్ వీడియో అని తెలియక చాలా మంది మొదట భయాభ్రాంతులకు గురయ్యే ప్రమాదముంది. రోడ్డుపై తలోదిక్కు పరుగెత్తే సందర్భంలో యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలు లేకపోలేదు. అంతేకాదు కొంతమంది పేషెంట్లు ఉంటారు. వారు అకస్మాత్తుగా జరిగే పరిణామాలకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాంక్ వీడియోలను ఇటీవల పార్కులు, సినిమా థియేటర్లు, రద్దీ రోడ్లు తదితర జనారణ్య ప్రాంతాల్లో ఎక్కువగా షూట్ చేస్తున్నారు. కొంతమంది ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా వెళుతూ డ్రైవర్‌ను ఆటపట్టించే ప్రాంక్ వీడియో చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనలో డ్రైవర్ కారుకు అడ్డువస్తున్నారనే కారణంతో సడెన్ బ్రేకులు వేయడం ద్వారా కారు వెనకాల వచ్చే వాహనాలు అదుపు తప్పి భారీ ప్రమాదమే జరిగే అవకాశం ఉంటుంది. ఇవేమి ఆలోచించకుండా కొంతమంది యూట్యూట్‌లో పలు చానెళ్లను ఏర్పాటు చేసుకుని వికృత వీడియోలు షూట్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు. ప్రాంక్ వీడియోలపై నగర పోలీసులకు ఇటీవల ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రాంక్ వీడియోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
యాడ్స్ కోసం బరితెగింపు..!!
యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ప్రాంక్ వీడియోలను జనం ఎక్కువగా చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రాంక్ వీడియోలకు వ్యూయర్స్ ఎక్కువగా ఉంటున్నారు. ఇతరులను ఎగతాళి చేసి ఆటపట్టించే ఈ ప్రాంక్ వీడియోలకు లైకులు లక్షల్లో ఉంటున్నాయి. ఈ స్థితినే కొంతమంది యూట్యూబ్ చానెళ్ల వారు క్యాష్‌గా మలుచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. రకరకాల చానెళ్లు ఏర్పాటు చేసి ప్రాంక్ వీడియోలను చిత్రీకరిస్తున్నారు. రాక్షస ఆనందం పొందుతున్నారు. ప్రాంక్ వీడియోలకు ఆదరణ ఎక్కువగా వస్తే యాడ్స్ వచ్చే అవకాశం ఉండటంతో నిర్వాహకులు మరింత రెచ్చిపోయి రోడ్డుపై న్యూసెన్స్ సృష్టిస్తున్నారు. ఒంటరిగా వచ్చే అమ్మాయిలను ప్రాంక్ పేరుతో కొంతమంది పోకిరీలు ఇబ్బంది పెట్టే సంఘటన ఇటీవల ఇందిరాపార్కు వద్ద జరిగింది. బాధిత మహిళా లేక్ పెట్రోలింగ్ పోలీసులను పిలవడానికి ప్రయత్నించడంతో అక్కడి నుంచి ఆ ప్రబుద్ధులు జారుకున్నారు. కాలేజీ, ఆసుపత్రి, దేవాలయాలలో కూడా ప్రాంక్ వీడియోలు చేస్తూ జనాలను అవమనాపరిచే గ్యాంగ్‌లు పెరుగుతున్నాయి. క్రియేటివిటీ పేరుతో ఇతరులను ఆటపట్టించడం మంచిది కాదని మేధావులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

