హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో మైనర్ల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మైనర్ల కస్టడీకి కూడా కోర్టు అనుమతి ఇవ్వడంతో.. జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ ఐదుగుర్ని 14వ తేదీ వరకు కస్టడీలో ఉంచుకోనున్నారు.
గత నెల 28న అమ్నిషీయా పబ్‌లో జరిగిన పార్టీకి సంబంధించిన పూర్వపరాలను ఆరా తీసిన పోలీసులు, పార్టీ అనంతరం జరిగిన అఘాయిత్యంపై క్షుణ్ణంగా ఆరా తీశారు. నిమిషం, నిమిషం ఏం జరిగిందనే విషయాన్ని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించిన విషయం విదితమే.
జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అత్యాచారం కేసు నిందితులను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును హైదరాబాద్ పోలీసులు కోరారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరిగే సమయంలో ఐదుగురిని మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.