సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రజలకు భద్రత కల్పించడంలో భాగంగా తమ ప్రాణాలు అర్పించిన పొలీసు అమరవీరుల సేవలు మరవలేనివని సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి, సుధీర్‌బాబు అన్నారు. సోమవారం సైబరాబాద్ కమిషనరేట్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో, అంబర్‌పేట్‌లోని రాచకొండ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరుల స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎస్‌డబ్ల్యూ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రావు దేశవ్యాప్తంగా విధినిర్వహణలో ప్రాణాల కోల్పోయిన 214మంది పోలీసుల పేర్లను ప్ర కటించారు. అనంతరం ఆమన్‌గల్ ఎస్ఐ కె.హనుమంత్‌రెడ్డి, తలకొండపల్లికి చెందిన కానిస్టేబుల్ ఫహీముద్దీన్, ఆర్మ్డ్ కానిస్టేబుల్ ఈశ్వర్రావు కుటుంబాలను సీపీ మహంతి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో సైబరాబాద్ జాయింట్ సీపీ డి.జోయల్ డెవిస్, మాదాపూర్, మేడ్చల్, శంషాబాద్, బాలానగర్, రాజేంద్రనగర్ డీసీపీ లు జి.వినీ త్, కోటిరెడ్డి,
రాజేశ్, సురేశ్ కుమార్,శ్రీనివాస్, క్రైమ్ విభాగం డీసీపీ నర్సింహా, ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ డీసీపీ సృజన, సైబర్‌క్రైమ్స్ డీసీపీ శ్రీబాలాదేవి, ఎస్బీ డీసీపీ సాయిశ్రీ , అలాగే రాచకొండ పరిధి నుంచి యాదాద్రి, మల్కాజిగిరి, ఎల్బీనగర్ డీసీపీలు రాజేశ్ చంద్ర, పద్మజా, ప్రవీణ్కుయార్, ఎస్బీ డీసీపీ కరుణాకర్, అడ్మిన్ డీసీపీ ఇందిరా, క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు, షీ టీమ్స్ డీసీపీ ఉషా విశ్వనాథ్, ట్రాఫిక్ డీసీపీలు మనోహర్, శ్రీనివాస్‌లు, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్‌తో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.