సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పుష్ప-2 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా సినీ హిరో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు వస్తున్నారనే సమాచారా న్ని ఇచ్చి, అందుకు తగ్గ బందోబస్తును ఏర్పాటు చేయాలని కోరేందుకు వెళ్లినవారికి సమయం కేటాయించలేదనే విషయం బయటకు పొక్కకుండా ఉం డేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిన్నాయి. పోలీసులు మాత్రం మాకు ఎలాంటి సమాచారం థియేటర్ యజమాన్యం నుంచి రాలేదని, దీనికి థియేటర్ యజమాన్యంతో పాటు సినీ హిరోనే బాధ్యత వహించాలంటూ కేసు నమోదు చేసి, సినీ హిరో మినహా థియేటర్ మేనేజ్మెంట్కు చెందిన ముగ్గురిని తాజాగా అరెస్ట్ చేశారు.
ప్రీ రిలీజ్‌తో పాటు ఒకో టిక్కెట్ ధర రూ. 800 విక్రయించుకునేలా థియేటర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా థియేటర్ ప్రీ రిలీజ్ రాత్రి 9.30 గంటలకు ఉంటే సాయంత్రం 6 గంటల నుంచే ప్రేక్షకులు థియేటర్ వద్దకు చేరుకుంటూ రాత్రి 8 గంటల వరకే భారీ స్థాయిలో వచ్చేశారు. థియేటర్ సామర్థ్యం 1200 మాత్రమే.
వేల సంఖ్యలో సినీ ప్రేక్షకులు థియేటర్ పరిసరాల్లో గుమిగూడి ఉన్నారు. ఈ విషయాన్ని పోలీసులు ఎందుకు గుర్తించలే దు. అయితే అప్పటికే 10 మంది కంటే ఎక్కువగా సిబ్బంది లేరని సమాచారం. భారీ సంఖ్యలో ప్రేక్షకులు అక్కడకు వ చ్చిన విషయం తెలిసినా కూడా స్థానిక పోలీసులు, ఆయా డివిజన్, జోన్ అధికారులు వెంటనే ఎందుకు అప్రమత్తం కాలేదనే విమర్శలు వస్తున్నాయి. ఘటన స్థలంలో ఉన్న పోలీస్ సిబ్బంది తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడికి సీపీఆర్ నిర్వహించి శభాష్ అన్పించుకున్నారు.
అయితే.. ఆ ఘటన జరగడానికి మాత్రం అధికారుల నిర్లక్ష్యం బ యట పడకుండా ఉండేలా స్థానిక పోలీస్ అధికారులు వేగంగా పావులు కదిపారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహిస్తుంది. ఈ సమయంలో పోలీసుల వైఫల్యంతోనే సినిమా థియేటర్లో తొక్కిసలాట జరిగిందనే విషయం బయట ప్రచారం జరిగితే ఉన్నతాధికారులు విషయాన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశాలుంటాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండేలా స్థానిక అధికారులు పక్కా ఫ్లాన్ వేశారని స్థానిక ప్రజలు
చర్చించుకుంటున్నారు.
శనివారం రాత్రి చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్లో పనిచేసే కొందరిని అదుపులోకి తీసుకొని ముషీరాబాద్ ఠాణాకు తరలించినట్లు తెలిసింది. సిబ్బంది కుటుంబ సభ్యులు ముషీరాబాద్ పీఎస్ వద్దకు వెళ్లి ఆందోళన వ్యక్తం చేయడంతో వారిని చిక్కడపల్లి ఠాణాకు తరలించినట్లు సమాచారం. చిక్కడపల్లి పోలీసులు థియేటర్ సిబ్బందిని అదుపులోకి తీసుకొని ఎందుకు ముషీరాబాద్‌కు వెళ్లారు… నేరుగా చిక్కడపల్లి ఠాణాకు ఎందుకు వెళ్లలేదనే ప లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండగా.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సినిమా హిరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తా రా? అని పోలీసులను ప్రశ్నిస్తే దాటవేత ధోరణి ప్రదర్శించారు.
చిక్కడపల్లి, డిసెంబర్ 8 : పుష్ప-2 ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో ముగ్గురు వ్యక్తులను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రమేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో థియేటర్ ఏడు మంది యజమానుల్లో ఒకరైన సందీప్‌ను , థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్ లోయర్ బాల్కనీ చూసుకునే మేనేజర్ విజయ్ చందర్‌లను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ రాజు నాయక్, ఎస్సై మైనిక పాల్గొనారు.