అండాల అక్రమ దందా
మానవ అండాల అక్రమ రవాణా దందా కేసులో ఇప్పటికే అరెస్టయిన ఎనిమిది మంది నిందితులను ఈనెల 11 నుంచి 15 వరకు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించినట్లు మల్కాజిగిరి కమిషనర్ సుమతి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
-
8 మంది నిందితులకు ఐదు రోజుల పోలీస్ కస్టడీ
-
31 మంది మహిళల గుర్తింపు…మరో నిందితుడు అరెస్టు
మారేడ్‌పల్లి, నవంబర్ 11: మానవ అండాల అక్రమ రవాణా దందా కేసులో ఇప్పటికే అరెస్టయిన ఎనిమిది మంది నిందితులను ఈనెల 11 నుంచి 15 వరకు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించినట్లు మల్కాజిగిరి కమిషనర్ సుమతి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బేగంపేట పీఎస్‌లో నమోదైన కేసులో అమిత్ శర్మ, నిక్కత్ పర్వీన్, రేష్మా ఖాతూన్, మెఘావత్ శ్రీనివాస్ అలియాస్ సోను, ప్రదీప్, ఎస్కే. పర్వీన్, విజయ్ భగ్వాహ్ రావు సులుంకే, పంకజ్ పోనీలను విచారించనున్నట్లు తెలిపారు.
కాగా, బేగంపేట కేసుకు సంబంధించి మొత్తం 31 మంది మహిళలను గుర్తించిన పోలీసులు.. వారి వాంగ్మూలాలు, వైద్య చరిత్ర, గతంలో అండదానం చేసిన వివరాలు, సమ్మతి పత్రాలు వంటివి పరిశీలించనున్నారు. కొన్ని ఫెర్టిలిటీ కేంద్రాల్లో గతంలోనూ అండదానానికి సంబంధించిన రికార్డులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 14 ఫెర్టిలిటీ ఆస్పత్రులు, ఐవీఎఫ్ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. కాగా, దర్యాప్తులో భాగంగా మరో నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అండాల అక్రమ దందా
Health tips | కోడిగుడ్లు అతిగా తింటే డయాబెటిస్ వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారంటే..!
AP News | ఏపీలో మిగిలిన 23 లోకల్ బాడీ ఎన్నికలకు రేపే షెడ్యూల్ విడుదల..!
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

