POCSO Case : కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అనుచరుడు రవి కుమార్(Ravi Kumar) అలియాస్ రఫీపై పోక్సో కేసు (POCSO Case) నమోదైంది. అల్వాల్లో జిమ్లో పరిచయమైన యువతిని ట్రాప్ చేసిన రవి.. బాధిత మహిళతో పాటు మైనరైన ఆమె కూతురిని కూడా వేధించడంతో అతడిపై పోక్సో కేసు పెట్టారు. ఏ1గా రవి, అతడికి సహాయం చేసిన సోదరుడు ఏ2 రూపేష్పై పోక్సో కేసు రిజిష్టరైంది.
మైనంపల్లి హన్మంతరావు అనుచరుడైన రవి కుమార్ అలియాస్ రఫీ గతంలోనూ అమ్మాయిలను మోసం చేశాడు. ప్రేమ పేరుతో ముగ్గురు యువతులను పెళ్లి చేసుకొని, వారి ప్రైవేట్ వీడియోలు తీసి డబ్బుల ఇవ్వాలని బెదిరించినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. నిత్య పెళ్లి కొడుడైన రవికి ఇటీవల అల్వాల్ జిమ్లో పరిచయమైన యువతిని ట్రాప్ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని వేధింపులకు గురి చేశాడు. దాంతో, సదరు యువతి ఫిర్యాదుతో రవిపై పోక్సో కేసు పెట్టారు.
జిమ్లో పరిచయమైన యువతిని ట్రాప్ చేసిన మైనంపల్లి హన్మంతరావు అనుచరుడు రవి కుమార్ పై పోక్సో కేసు నమోదు
అల్వాల్లో జిమ్లో పరిచయమైన బాధిత మహిళతో పాటు ఆమె కూతురిని కూడా వేధించడంతో A1 రవి, అతనికి సహాయం చేసిన సోదరుడు A2 రూపేష్ పై పోక్సో కేసు నమోదు
గతంలో ప్రేమ పేరుతో ముగ్గురు యువతులను… https://t.co/VIa2W5f7lr pic.twitter.com/NVboeg1gZl
— Telugu Scribe (@TeluguScribe) June 29, 2026