మాదాపూర్, డిసెంబర్ 24: మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ నెల 22న ఏర్పాటు చేసిన పెటెక్స్, కిడ్స్ ఫెయిర్ 2023 ఎక్స్ పోకు అనూహ్య స్పందన వచ్చింది. మూడు రోజులుగా కొనసాగుతున్న ఎక్స్పో ఆదివారంతో ముగిసింది. పెటెక్స్ ఇండియా ఎక్స్ పోలో శునకాలు, పిల్లులు, పక్షులు, చేపలు, అన్యదేశ పెంపుడు జంతువులను ప్రదర్శించారు. ఇందులో 150 కి పైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించి సందర్శకులకు వాటి ఉపయోగాలను గురించి తెలియజేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని అదుపులో ఉంచే ఈ డాగ ఫుడ్ వెండింగ్ మెషిన్ ఎక్స్ పో అనేక మంది సందర్శకులను విశేషంగా ఆకర్శించింది. అనంతరం శునకాలు, పిల్లుల యజమానులను నిర్వాహకులు సత్కరించారు.