పీసీవీ టీకాలను చిన్నారులకు విధిగా ఇప్పించాలి : డాక్టర్ పద్మజ
పీసీవీ టీకాలు | న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఏడాదిలోపు వయసు కలిగిన పిల్లలకు ఇవ్వడం వల్ల న్యూమోనియా బారిన పడకుండా కాపాడుకోవచ్చని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ అన్నారు.

సుల్తాన్‌బజార్, ఆగస్టు 18 : న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ఏడాదిలోపు వయసు కలిగిన పిల్లలకు ఇవ్వడం వల్ల న్యూమోనియా బారిన పడకుండా కాపాడుకోవచ్చని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ అన్నారు. కోఠి ఆర్ఎఫ్ పీటీసీ యూపీహెచ్సీ సుల్తాన్‌బజార్, యూపీహెచ్‌సీలలో ఏడాది లోపు చిన్నారులకు పీసీవీ టీకాల పంపిణీ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మజ మాట్లాడుతూ.. ప్రయివేట్ దవఖానలలో ఒక టీకాకు నాలుగు వేల రూపాయల ఖర్చు అవుతుందన్నారు.
ప్రభుత్వం ఈ టీకాను ఏడాది లోపు చిన్నారులకు మూడు విడుతలుగా ఉచితంగా అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎఫ్ పీటీసీ, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ, డాక్టర్ రమేష్, పీహెచ్ఎన్ రామలక్ష్మితో పాటు నర్సులు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

