కోచ్‌లకు రోజు కూలీ కంటే తక్కువ జీతమా?
ప్రభుత్వం క్రీడలకు భారీ బడ్జెట్‌ను కేటాయించినా వాటిని అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఎల్బీ స్టేడియంలో శాట్ కోచ్‌ల నిరసన
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రభుత్వం క్రీడలకు భారీ బడ్జెట్‌ను కేటాయించినా వాటిని అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్-3 కోచ్‌ల వేతనాలు అందుకోవాల్సిన తమకు సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రోజు కూలీ కంటే తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఎల్బీ స్టేడియంలోని శాట్ ప్రధాన కార్యాలయం ముందు 70 మందికి పైగా కోచ్‌లు, 200ల మందికిపైగా క్రీడాకారులు నిరసన తెలిపి శాట్ వీసీ-ఎండీ సోనీబాలా దేవికి వినతిపత్రం సమర్పించారు. అర్హత కలిగిన కోచ్‌లకు కనీస వేతనంగా రూ.45 వేలు ఇవ్వాలని, 2009 నుంచి పని చేస్తున్న వారికి అనుభవం ఆధారంగా జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

