అమెజాన్ 65 వేల కోట్ల పెట్టుబడి
భారత్‌లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం 2030 నాటికి 7 బిలియన్ డాలర్లు(రూ.65,393 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న 4 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇది అదనమని పేర్కొంది. ఈ పెట్టుబడులతో 934 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు కొత్త పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పబోతున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పెట్టుబడితో కార్బన్ రహిత విద్యుత్‌ను కొనుగోలు చేసే దేశంలోని ప్రధాన కార్పొరేట్ సంస్థల్లో ఒకటిగా అమెజాన్ నిలుస్తుందని కంపెనీ తెలిపింది.
న్యూఢిల్లీ, నవంబర్ 17: భారత్‌లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం 2030 నాటికి 7 బిలియన్ డాలర్లు(రూ.65,393 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న 4 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇది అదనమని పేర్కొంది. ఈ పెట్టుబడులతో 934 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు కొత్త పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పబోతున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పెట్టుబడితో కార్బన్ రహిత విద్యుత్‌ను కొనుగోలు చేసే దేశంలోని ప్రధాన కార్పొరేట్ సంస్థల్లో ఒకటిగా అమెజాన్ నిలుస్తుందని కంపెనీ తెలిపింది.
కొత్తగా నెలకొల్పబోయే ప్రాజెక్టుల్లో కర్ణాటకలో 234 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రం కూడా ఉన్నది. ఆసియాలో అమెజాన్ ఇప్పటివరకు ఒప్పందం కుదుర్చుకున్న అతిపెద్ద పవన విద్యుత్ ప్రాజెక్టు ఇదేనని తెలిపింది. అదే రాష్ట్రంలో 200 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ మిశ్రమ ప్రాజెక్టు, మధ్యప్రదేశ్‌లో 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం, రాజస్థాన్‌లో 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేయబోతున్నది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా ఖరారైన ఈ ప్రాజెక్టులు, భారత్‌లో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న 4 బిలియన్ డాలర్ల పునరుత్పాదక ఇంధన పెట్టుబడిలో భాగమని అమెజాన్ పేర్కొన్నది. ఈ ప్రాజెక్టులు పనిచేయడం ప్రారంభిస్తే భారత్‌లో అమెజాన్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2 గిగావాట్లకు మించనుందని తెలిపింది. భారత్‌లో అమెజాన్‌కు మొత్తం 57 ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

