Minister Talasani | రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదు : మంత్రి తలసాని
Minister Talasani | అధికారం ఎవరికీ శాశ్వతం కాదని,రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ : అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక వన మహోత్సవం లో పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు.
అధికారంలో ఉన్నామని వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం బాధకరమని పేర్కొన్నారు. అమీర్‌పేట లో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 1994లో ఎన్టీఆర్ తనకు రాజకీయ జీవితం ప్రసాధించిన మహనీయుడుని ఎన్నటికీ మరవనని స్పష్టం చేశారు.
బన్సీలాల్ పేట డివిజన్ లో విస్తృత ప్రచారం
బన్సీలాల్ పేట డివిజన్లో మంత్రి తలసాని శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణం కోసం నామమాత్రపు ఆర్ధిక సహాయం అందించాయని ఆరోపించారు. పేదల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్(CM KCR) అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందజేశారని వెల్లడించారు. నగరంలో ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు తాగునీరు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యమని ఆయన అన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

