దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా విరాజిల్లుతున్న పంజాగుట్ట పీఎస్ పరిధిలో ఈ ఏడాది కట్టుదిట్టమైన చర్యలు, ఫ్రెండ్లీ పోలిసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో తీవ్ర నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయి. రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఏడాది రికవరీ శాతంలో మాత్రం కొంత వెనుకబాటుకు గురైంది. మొత్తంగా శాంతిభద్రతల పరిరక్షణలో పంజాగుట్ట పోలీసులు భేష్ అనిపించుకున్నారు. 2022 సంవత్సరానికి గాను వివరాలు ఇలా ఉన్నాయి.
– ఖైరతాబాద్, డిసెంబర్ 30
సొత్తు రికవరీలో గతేడాదితో పోల్చితే ఈ సారి కొంత వెనుకబాటులో ఉన్నాయి. 2021లో రూ. 7,23,3,299 చోరీ జరిగితే, రూ.6,48,1,599తో 89.61 శాతం రికవరీ చేశారు. అలాగే 2022 డిసెంబర్ నాటికి రూ. 9,85,6,199కు గాను రూ.5,72,8,199 స్వాధీనం చేసుకోగా, 58.12 శాతం రికవరీ జరిగింది. ఇదిలా ఉండగా, మిస్సింగ్ కేసులు 78, మూడు చోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి.