ప్రగతి పరుగులు

- గ్రేటర్‌వ్యాప్తంగా తొలిరోజు అట్టహాసంగా పట్టణ ప్రగతి ప్రారంభం
- ఆరోగ్యవంతమైన జీవనం కోసమే హరితహారం
- మంత్రి తలసాని, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- ఖైరతాబాద్ దుర్గానగర్, బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ పార్కులో ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
- మహేశ్వరం మండలం సిరిగిరిపురం పల్లె ప్రగతిలో పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి
- రూ.50 లక్షలతో నిర్మించిన బస్‌టెర్మినల్ ప్రారంభం
- మేడ్చల్ జిల్లా కండ్లకోయ, పీర్జాదిగూడలో మొక్కలు నాటిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి
మహేశ్వరం, జూలై1: పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలో రూ. 50 లక్షల నిధులతో బస్ టెర్మినల్‌ను, సిరిగిరిపురం గ్రామంలో పల్లె ప్రగతి పనులను మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం సిరిగిరిపురం సర్పంచ్ కాసుల సురేశ్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు వెయ్యికోట్లు వెచ్చించి పల్లె ప్రగతి పనులను చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదలతో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇచ్చి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి దయాకర్‌రావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి లతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
India vs New Zealand | సిరీస్‌లో మొదటిసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్..! భారత్ బ్యాటింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

