ప్రమాదపుటంచున ప్రయాణం
బస్సుల సంఖ్య పెంచకుండా బస్సు పాస్‌ల ధరలు, మెట్రో-బస్సు కామన్ పాస్ ధరలు పెంచి సామాన్య ప్రయాణికులపై ప్రభుత్వం ఆర్థిక భారం మోపుతోంది. ఉచిత బస్సు అని మహిళలు అధికంగా ప్రయాణించిన ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు బస్సుల్లో డోర్ల వద్ద భయంభయంగా ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. బస్సుల పరిస్థితిపై నెటిజన్లు సోషల్ మీడియాలో తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.
- బస్సుల సంఖ్య పెంచాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు
సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : బస్సుల సంఖ్య పెంచకుండా బస్సు పాస్‌ల ధరలు, మెట్రో-బస్సు కామన్ పాస్ ధరలు పెంచి సామాన్య ప్రయాణికులపై ప్రభుత్వం ఆర్థిక భారం మోపుతోంది. ఉచిత బస్సు అని మహిళలు అధికంగా ప్రయాణించిన ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులు, ఉద్యోగులు బస్సుల్లో డోర్ల వద్ద భయంభయంగా ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. బస్సుల పరిస్థితిపై నెటిజన్లు సోషల్ మీడియాలో తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. నగరంలో రోజు రోజుకు జనాభా సంఖ్య పెరుగుతోంది. చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చే వారితో పాటు శివారు ప్రాంతాలు కూడా రద్దీగా మారుతున్నాయి.
అయితే ప్రజా రవాణా వ్యవస్థ ప్రజలకు, నగరవాసులకు తగిన విధంగా ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. భరద్వాజ్ తన ఎక్స్‌లో.. మేడ్చల్ డిపోకి చెందిన బస్ నంబర్ ఏపీ20జెడ్0088 సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ రూట్లో ప్రయాణించే ఓ బస్సు ఫుల్ రష్‌గా ఉండటమే కాకుండా కెపాసిటీకి మించి ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేశాడు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మార్గంలో వెళ్లే బస్సుల్లో ప్రయాణికులు సామర్థ్యానికి మించి కాకుండా చివరకు ఫుట్‌బోర్డుపై కూడా వేలాడుతూ ఒకరి కాళ్లపై మరొకరు నిలబడి జర్నీ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని భరద్వాజ్ ప్రశ్నించాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

