సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డు వెంబడి నిర్మించిన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌ను అక్టోబర్ 1న ప్రారంభించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఒకేసారి 23 కి.మీ పొడవుతో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.