OU : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మరోసారి రోడ్కెక్కారు. హాస్టళ్లలో భోజనం నాసికరంగా ఉంటుందని, పాడైపోయిన భోజనం పెడుతున్నారని మంగళవారం రాత్రి భారీ సంఖ్యలో విద్యార్ధులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఆహారం నాణ్యంగా ఉండడం లేదని హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు లేవని.. తమ సమస్యల గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వార్డెన్, ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు.
హాస్టల్లో వడ్డించే పాడైపోయిన ఆహారంతో తాము అనారోగ్యాలకు గురవవుతున్నామని ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, హాస్టళ్లలో కనీస వసతులు కల్పించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. విద్యార్థుల అకస్మికంగా రోడ్డుపై బైఠాయించడంతో క్యాంపస్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి.