ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బెస్ట్ టీచర్ అవార్డుల్లో ఓయూ సైన్స్ విభాగాలకు చోటు దక్కకపోవడంపై ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ వర్సిటీ ఇన్చార్జి వీసీకి లేఖ పంపించారు. బెస్ట్ టీచర్ అవార్డు పొందిన అధ్యాపకులను అభినందించారు. వారు అందించిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని చెప్పారు.
సైన్స్ కళాశాలలోని 18 విభాగాల్లో ఒక్కరిని కూడా అవార్డులకు ఎంపిక చేయకపోవడం శోచనీయమన్నారు. సాధారణంగా ఏటా సైన్స్, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, కామర్స్, ఇంజినీరింగ్ విభాగాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారని గుర్తు చేశారు. ఈ ఏడాది సైన్స్ విభాగాల నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవడం ఆ విభాగాల అధ్యాపకులను తీవ్రంగా నిరుత్సాహపరిచిందన్నారు. సైన్స్ విభాగాలకు చెందిన అధ్యాపకుల ప్రొఫైల్స్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని ఓయూ అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి
ఆ గ్రామ పంచాయతీల సంగతేంటి?
Ghmc
మేడ్చల్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 61 వాటిల్లో 28 గ్రామపంచాయతీలను ప్రభుత్వం వివిధ మున్సిపాలిటీల పరిధిలోకి విలీనం చేసింది. అయితే మిగిలిన 33 గ్రామ పంచాయతీల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వీటిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుదోనన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. విలీనం కాని గ్రామాలు మున్సిపాలిటీ పరిధిలోకి మారుతాయా..లేక గ్రామ పంచాయతీలుగానే కొనసాగుతాయా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. గురువారం రాత్రి 8 గంటల వరకు రాజేంద్రనగర్, దాని పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 3.50 సెం.మీలు, సికింద్రాబాద్ పాటిగడ్డలో 1.70, బన్సీలాల్‌పేట్, భోలక్‌పూర్, ముషీరాబాద్, అంబర్‌పేటలో 1.65, ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో 1.50, మూసాపేట్, ఉప్పల్ మూసారాంబాగ్, బతుకమ్మకుంట ప్రాంతాల్లో 1.4 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండ్రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
భారీ నిర్మాణాల వద్ద చైల్డ్ కేర్ సెంటర్లు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో చిన్నారులపై వీధి కుక్కల దాడుల పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది. భారీ నిర్మాణ ప్రదేశాల్లో కూలీల పిల్లల కోసం చైల్డ్ కేర్ సెంటర్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు.