ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 1: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ సబ్జెక్టులలో ఎమ్మెస్సీ కోర్సును కనీసం 60 శాతం మార్కులతో పాసైన వారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 22 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వచ్చే నెల 18వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు.
ఎంసీఏ దూరవిద్య ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) ద్వారా అందించే ఎంసీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ పరీక్షల విభాగం తెలిపింది. ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.