ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 9:ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. బీఈ(సీబీసీఎస్)మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలతోపా టు ఎనిమిదో సెమిస్టర్ రీవాల్యుయేషన్ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలోఅందుబాటులోఉంచినట్లు పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్ష జవాబు పత్రాల ఫొటోకాపీ పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. ఎంబీఏ అన్ని సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను బుధవారం విడుదల చేశామని, తమ జవాబు పత్రాల నకలు పొందగోరే వారు ఈ నెల 29వ తేదీ వరకు సంబంధిత రుసుము చెల్లించి, తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.