గాజులరామారం, డిసెంబర్ 14 : జిమ్‌లకు వెళ్లి వేల కు వేలు ఖర్చు చేయకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పార్కుల్లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న పలు పార్కుల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాజులరామారం సర్కిల్లోని గాజులరామారం, జగద్గిరిగుట్ట, సూరారం, చింతల్ డివిజన్లలో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇటీవలే ఈ జిమ్‌ల ఏర్పాటు విషయమై ఎమ్మెల్యే వివేకానంద్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో స్థానికులు హర్షంవ్యక్తం చేస్తున్నారు.
పార్కుస్థలాల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేయడం సంతో షంగా ఉంది. ప్రైవేటు జిమ్‌లకు వెళ్లే స్థోమతలేని పేద, మ ధ్యతరగతి ప్రజలకు ఈ ఓపెన్ జిమ్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయి. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మిగిలిన పార్కుల్లో సైతం ఈ జిమ్‌లను అందుబాటులోకి తేవాలి. – సునీల్ , జగద్గిరిగుట్ట
గాజులరామారం సర్కిల్ పరిధిలో ని నాలుగు ప్రాంతాల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయడం పట్ల ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ జిమ్‌లలో ఏర్పాటు చేసే పరికరాలతో ప్రజల్లో ఫిట్నెస్ పెంపొందుతుంది. ప్రతి రోజు వ్యాయామం చేయడం పట్ల ఫిట్నెస్తోపాటు ఆరోగ్యవంతంగా ఉంటారు.
– కొలుకుల జగన్ , జగద్గిరిగుట్ట కార్పొరేటర్