కాచిగూడ,ఏప్రిల్ 1 : కేంద్ర ప్రభుత్వ అమోదిత నేషనల్ అకాడమీ ఆప్ సైబర్ సెక్యూరిటీ(Cyber Security Courses) ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్లో(Online Training) శిక్షణకై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి గల యువతి, యువకుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు.
సోమవారం కాచిగూడలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన అభ్య ర్థులకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, ఐటీ సెక్యూరిటీ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీర్, పాలిటెక్నిక్, డిప్లొమా యువకులు ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 7893141797, ఆన్లైన్లో www.nacsindia.org లో సంప్రదించవచ్చని ఆమె కోరారు.