మేడ్చల్, నవంబర్ 28: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామంలో గురువారం జరిగింది. మండల పరిధిలోని రావల్కోల్ గ్రామానికి చెందిన నాగరాజు(34) రాజబొల్లారం గ్రామంలో ఉన్న మోనార్క్ కంపెనీలో పని చేస్తున్నాడు.
ప్రతి రోజు మాదిరిగానే గురువారం ఉదయం 6 గంటలకు కంపెనీకి పూడూరు మీదుగా వస్తుండగా పూడూరు చౌరస్తా వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగారజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడాది కింద వివాహం జరుగగా, భార్య గర్భంతో ఉన్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.