బంజారాహిల్స్,జూలై 7: బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి ఎన్బీటీనగర్లోని పీజేఆర్ విగ్రహం సమీపంలో కొంతమంది వ్యక్తులు తమ వాహనాలు పార్క్ చేస్తున్న సమయంలో మితిమీరిన వేగంతో వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో ఆందోళనకు గురయిన కారు డ్రైవర్ తన కారును వెనక్కి తీయగా వెనకనున్న ర్యాపిడో బైక్ డ్రైవర్ మనోజ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు, ఒక బైక్ ద్వంసం అయ్యాయి.
ఈ మేరకు స్థానికులు కారు నడిపిస్తున్న గణేష్‌ను పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. అతడికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. ఈ మేరకు పోలీసులు కారు డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.