హైదరాబాద్: హైదరాబాద్లోని వనస్థలిపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనస్థలిపురంలోని పనామ (Panama) వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్ బైకు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బైక్పై వెళ్తున్న యువకుడు గాలిలోకి పైకి ఎగిరి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను దవాఖానకు తరలించారు. యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు.