హైదరాబాద్: హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ (Langar House) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటలకు లంగర్‌హౌస్ దర్గా సమీపంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వాహనాన్ని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఓ యువతి అక్కడికక్కడే మృతిచెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
పోలీసు వాహనంలో ఉన్న ముగ్గురు పోలీసులకు స్వంగా గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమై కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. మద్యం మత్తులో ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన యువతిని కశ్వి (20)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన లంగర్‌హౌస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.