Rajendranagar | ఆస్తి వివాదంలో కన్నతండ్రి, అన్నపై తమ్ముడి దాడి : వీడియో
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలో ఆస్తి వివాదంలో ఓ వ్యక్తి కన్నతండ్రి, తోడబుట్టిన అన్న మీద కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలో ఆస్తి వివాదంలో ఓ వ్యక్తి కన్నతండ్రి, తోడబుట్టిన అన్న మీద కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. ఉప్పరపల్లికి చెందిన అనంతరెడ్డి అనే వృద్ధుడు తన ఆస్తిని ఇద్దరు కుమారుల రవికాంత్ రెడ్డి, ఓం రెడ్డి పేరిట రాశాడు. అయితే చిన్న కుమారుడు ఓం రెడ్డి విచక్షణ మరించి కన్నతండ్రి అనంతరెడ్డి, అన్న రవికాంత్ రెడ్డి, వదినలపై దాడికి దిగాడు.
కన్నతండ్రిని ఎందుకు కొడుతున్నావు? అని పెద్ద కుమారుడు రవికాంత్ రెడ్డి నిలదీయడంతో, మరింత రెచ్చిపోయి.. మీరు ఇక్కడి నుండి వెళ్లకపోతే మిమ్మల్ని చంపేస్తా అంటూ వారిని బెదిరించాడు. ఓం రెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన రవికాంత్ రెడ్డిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఆస్తి వివాదంలో కన్నతండ్రి, అన్నపై తమ్ముడి దాడి
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలో ఆస్తి వివాదంలో కన్నతండ్రి, తోడబుట్టిన అన్న మీద కిరాతకంగా దాడికి తెగబడిన వ్యక్తి
ఉప్పరపల్లికి చెందిన అనంతరెడ్డి అనే వృద్ధుడు తన ఆస్తిని ఇద్దరు కుమారుల పేరిట రాయగా.. అయితే, పెద్ద… pic.twitter.com/t0009bMXRQ
— Telugu Scribe (@TeluguScribe) June 24, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

