మైలార్‌దేవ్‌పల్లి, జూన్ 3: ఎంత ఎత్తుకు ఎదిగినా తాము చదివిన పాఠశాలను వాళ్లు మరిచిపోలేదు. దాదాపు పాతికేళ్ల కిందట పదో తరగతి పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వారు.. వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధికి చేతనైన సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పాఠశాల అభివృద్ధికి విరాళాలు అందించారు.
హైదరాబాద్‌లోని అత్తాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000–01 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు.. పాఠశాల అభివృద్ధికి రూ.10 వేలు, ఉపాధ్యాయులు శ్రీనివాస్ సాగర్‌కు రూ.11 వేలు విరాళం అందజేశారు. మరో పూర్వ విద్యార్థి అడ్వకేట్ హరిదాస్ రూ.5వేలు అందజేశారు. పాఠశాల అభివృద్ధికి తమకు తోచిన సహాయసహకారాలు అందజేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.
పదవ తరగతి చదువు