హైదరాబాద్ : గిరిజన బాలిక(Tribal girl) అబార్షన్(Abortion) కేసునువైద్యశాఖ సీరియస్‌గా తీసుకుంది. అబార్షన్(Clinic seized) )చేసిన క్లినిన్ను సీజ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో ఉన్న శ్రీ శ్రీనివాస క్లినిక్‌ను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. 13 ఏళ్ల గిరిజన మైనర్ బాలిక గర్భం దాల్చిన ఘటనలో అబార్షన్ చేసిన క్లినిక్ వైద్యుడు డాక్టర్ రంజిత్ వ్యవహారంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్లినిక్ ను సీజ్ చేశారు. కాసేపటి క్రితం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సైతం ఈ ఘటనపై స్పందించారు.
సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే విధంగా ఉన్న మైనర్ అబార్షన్ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా సంచ లనం రేకెత్తించిన విషయం విధితమే. అయితే గత మూడు రోజులుగా మీడియాలో ఈ ఘటనపై తీవ్ర దుమా రం రేగుతుంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆలస్యంగా స్పందించినప్పటికి చర్యల నిమిత్తం సీజ్ చేసిన ట్టు తెలిపారు. కాగా, ఆయుర్వేదిక్ డాక్టర్‌గా అనుమతి తీసుకున్న రంజిత్ అల్లోపతి వైద్యం చేస్తున్నారు. అలాగే శ్రీలక్ష్మీ మెడికల్ హాల్ పేరిట లోపల శ్రీ శ్రీనివాస క్లినిక్ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధం. మరి ఇన్ని రోజులు అధికారులు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.