TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ఉద్యోగుల నుంచి, వారి సేవా నిబంధనలు, సంబంధిత విషయాలపై పలు సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం TGRTC ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి, తగిన సిఫార్సులను సూచించడానికి ప్రభుత్వం ఈ క్రింది అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తోంది.
ఈ కమిటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రహదారులు & భవనాల శాఖ ఛైర్మన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాల శాఖ సభ్యుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ సభ్యుడు, వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్ఆర్టీసీ సభ్యుడు & కన్వీనర్ ఉండనున్నారు. ఈ కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుండి నాలుగు వారాల వ్యవధిలోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించాలి.
Hot Adilabad | ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్
Jailer 2 | ఎట్టకేలకి జైలర్ 2 షూటింగ్ పూర్తి.. రజనీకాంత్ అభిమానుల్లో పెరిగిన అంచనాలు
Earthquake | ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు