సిటీ బ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సుకూన్ ఫెస్ట్‌లో ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం నేతలు జేఏసీ ప్రతినిధులతో గొడవకు దిగారు. సుకూన్ ఫెస్ట్ నిర్వహణలో తమను భాగస్వామ్యం చేయాలని విద్యార్థులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్లు తెలిసింది.
హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల్లో కాంగ్రెస్ సర్కార్ సృష్టించిన విధ్వంసమే థీమ్‌గా ఈ వేడుకలను గత గురువారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించారు. 400 ఎకరాలను కాంగ్రెస్ సర్కార్ రియల్ ఎస్టేట్‌కు కట్టబెట్టకుండా అడ్డుకునేందుకు చేపట్టిన ఆందోళనలు, నిరసనల్లో ఏనాడూ పాల్గొనని ఎన్ఎస్యూఐకు వేడుకల నిర్వహించే హక్కు లేదని జేఏసీ ప్రతినిధులు తేల్చి చెప్పారు.
దీంతో స్టేజ్ పైకి వెళ్లి జేఏసీ విద్యార్థులతో వాగ్వాదానికి దిగారు. ఎన్ఎస్యూఐ, జేఏసీ విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిందని విద్యార్థులు చెబుతున్నారు. యూనివర్సిటీ భూములను రక్షించడానికి తమతో కలిసి రాకుండా కాంగ్రెస్ సర్కారుకు వంతపాడిన వారు ల్యాండ్ థీమ్‌తో నిర్వహించే ఫెస్ట్‌లో భాగం కావడానికి వీల్లేదని మిగతా IIవ పేజీలో