కాచిగూడ : అంబర్‌పేట నియోజకవర్గంలోని పలు డివిజన్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని మసీద్ఈ అజీమియా,లెజెండ్ అపార్ట్ మెంట్ లైన్లో రూ.19 లక్షల రూపాయలు, అదే విధంగా డివిజన్లోని చెప్పల్‌బజార్‌లో రూ.12 లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం కాచిగూడ కార్పొటర్ ఉమాదేవితో కలిసి ఎమ్మెల్యే కాలేరు ప్రారంభించారు.
అనంతరం బస్తీలో ఎమ్మెల్యే, కార్పొరేటర్ పర్యటించి స్థానిక ప్రజల నుంచి నీటి, డ్రైనేజీ పలు సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ నియోజకవర్గంలోనిఅన్ని బస్తీ, కాలనీలలో సీసీ రోడ్లను వేయడానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు పేర్కొన్నారు.
నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.పలు ప్రాంతాల్లో స్థానికులను ప్రధానంగా వేధిస్తున్న నీటి కాలుష్య సమస్య శాశ్విత పరిష్కారంతో పాటు బస్తీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర బీష్మదేవ్,కన్నె రమేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.