సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు రాసి ఫెయిలైన విద్యార్థులు ఇప్పటికే కొంత మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల్లో విజ యం దక్కేలా చొరవ చూపాల్సిన ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఏ సబ్జెక్టుల్లో విధ్యార్థులు ఫెయిలయ్యారో వాటిలో పాసయ్యేలా సం బంధిత అంశాలపై బోధించాలి.
కానీ ఆ దిశగా అధికారులు అడుగులు వేయడం లేదు. 2024-25 విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకొని మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కలిపి మొత్తం 19,125 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 8,266 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాసుకాలేదు.
ఇందులో చాలా మంది గణి తం, సైన్స్, ఇంగ్లిష్తో పాటు తెలుగు, హిందీలో అత్యధికంగా ఫెయిల్ అ య్యారు. కాగా, గణితం, ఇంగ్లిష్కు ట్యూషన్ చె ప్పాల్సిన అవసరం ఉంద ని విద్యార్థులు చెబుతున్నారు. కలెక్టర్ స్పందించి ఈ వారం రోజులకైనా గణితం, ఇంగ్లిష్ లాంటి సబ్జెక్టులపై బోధన చేయించాలని కోరుతున్నారు. కాగా, జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.