Osmania Employees | వేతనాల కోసం తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మహాధర్నా చేపట్టారు.. మాకు పనికి తగ్గట్లు ప్రతినెలా సమయానికి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్నాలో పాల్గొన్న ఓ మహిళా ఉద్యోగి మాట్లాడుతూ.. నేను ఉస్మానియా ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా వర్క్ చేస్తున్నా. గత సంవత్సరాలుగా లివర్ ట్రాన్స్ఫ్లాంట్ ఐసీయూ విభాగంలో పని చేస్తున్నా.. నేను ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేయబట్టి 7 సంవత్సరాలు అవుతుంది. మాకు 5 నెలలుగా జీతాలు లేవని ఆవేదన వ్యక్తం చేసింది.
మేము రెగ్యులర్‌గా, కంటిన్యూగా డ్యూటీకి వస్తున్నాం. ఒక్క నెల పడ్డది అంతే.. ఇక మిగిలియ్ అయితే బడ్జెట్ లేదని అంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం బిల్ ఉందని అంటున్నారు. కానీ ఇంతవరకు ఆ బిల్లు వెళ్లలేదు. మాకు జీతాలు కూడా రాలేదు. మేం అతి కష్టం మీద డ్యూటీకి వస్తున్నాం. చేతుల్లో డబ్బుల్లేకున్నా.. మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కానీ మేం డ్యూటీ చేస్తున్నాం. ఇంట్లో మా ఫ్యామిలీలో కూడా ఎవరూ ఆరోగ్యంగా లేరని వాపోయింది.
సాలరీలు లేకపోతే మీరు కూడా వెళ్లిపోండని వాళ్లు కూడా అంటున్నారు. మా దగ్గర బడ్జెట్ కూడా ఏం లేదు. మా ఆయన కూడా ఈరోజు పనిచేస్తేనే రేపు పూట గడవని పరిస్థితి మాది. మేం అలాంటి కండిషన్స్‌లో పని చేస్తున్నాం. పేరుకు పెద్దాసుపత్రి. ఇలాంటి పెద్దాసుపత్రిలో మేం డ్యూటీ చేస్తున్నమంటేనే మహా ఎక్కువ. మా వేతనాలు ప్రభుత్వమే నేరుగా ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి. ఒక రోజు తిండి ఉండి ఇంకో రోజు తిండి లేక గడుపుకుంటున్నమంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రజా పాలన- ప్రజా ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ హయాంలో అత్యవసరం వైద్య సేవలందించే ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో వారి ఆవేదనతో అర్థం అవుతుంది.
నేను ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్నాను.. 5 నెలల నుండి మాకు జీతాలు రావడం లేదు
వేతనాల కోసం తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మహాధర్నా
మా ఆర్ధిక పరిస్థితి బాగా లేకున్నా మేము రోజు డ్యూటీ చేస్తున్నాము.. మా ఇళ్ళు గడవడమే కష్టంగా ఉంది
మాకు పనికి… pic.twitter.com/yQnOniGTBu
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2026
Volcano eruption | అగ్నిపర్వతం నుంచి భారీ విస్ఫోటనం.. పరుగులు తీసిన పర్యాటకులు
Prabhas | 2027 ప్రభాస్ నామ సంవత్సరం.. ఒకటి కాదు మూడు భారీ ట్రీట్స్ ప్లాన్ చేస్తున్న రెబల్ స్టార్