Petrol Bunks | నగదు చెల్లించినా పెట్రోల్ బంకులకు అందని సరఫరా.. చమురు కంపెనీల తీరుతో పెట్రోల్ కష్టాలు
Petrol Bunks | పెట్రోల్ బంక్ ల యజమానులు పెట్రోల్ స్టాక్ కొరకు చమురు కంపెనీలకు నగదును చెల్లించినా చమురు కంపెనీలు పెట్రోల్ బంకులకు తగినంత చమురును సరఫరా చేయకపోవడం వలనే పెట్రోల్ కష్టాలు మొదలైయాయని బంకుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Petrol Bunks | తుర్కయంజాల్, ఏప్రిల్ 20 : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో పెట్రోల్ అందుబాటులో లేక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే దేశంలో చమురు అందుబాటులో ఉన్న చమురు కంపెనీల యాజమాన్యల తీరుతోనే పెట్రోల్ సంక్షోభం వస్తుందని పెట్రోల్ బంకుల యజమానులు వాపోతున్నారు. పెట్రోల్ బంక్ ల యజమానులు పెట్రోల్ స్టాక్ కొరకు చమురు కంపెనీలకు నగదును చెల్లించినా చమురు కంపెనీలు పెట్రోల్ బంకులకు తగినంత చమురును సరఫరా చేయకపోవడం వలనే పెట్రోల్ కష్టాలు మొదలైయాయని బంకుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో చమురు కంపెనీలు నష్టాలు ఎదుర్కోవాల్సివస్తుందనే సాకుతో పూర్తి స్థాయిలో పెట్రోల్ సరఫరా నిలిపివేశారంటున్న యజమానులు.. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చమురు కంపెనీలతో చర్చలు జరిపి పెట్రోల్ స్టాక్ కొరకు నగదు చెల్లించిన పెట్రోల్ బంకులకు వెంటనే తగినంత సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని యజమానులు కోరుతున్నారు,.
ఆదివారం రాత్రి నుంచి ఆధిభట్ల సర్కిల్ పరిధి తొర్రూర్, తుర్కయంజాల్ డివిజన్లలో ఉన్న అన్ని పెట్రోల్ బంకులు బంద్ ఉండడంతో పెట్రోల్ లభించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సోమవారం ఒక్కో బంక్‌కు కేవలం ఒక లోడ్ అందించనున్నట్లు పెట్రోల్ బంకుల యజమానులు తెలిపారు. అయితే ఒక్క లోడ్ కాకుండా తమకు కావాల్సినంత పెట్రోల్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ముందుగా నగదు చెల్లించినవారికి సరఫరా : హెచ్ పీ పెట్రోల్ బంక్ సేల్స్ ఆఫీసర్ లోకేష్
పెట్రోల్ స్టాక్ కొరకు పూర్తి మొత్తంలో నగదు చెల్లించినవారికి పెట్రోల్ సరఫరా చేస్తున్నాము. పూర్తి మొత్తం లో నగదు చెల్లించని బంక్ లకు మాత్రం సరఫరా ఇవ్వడం లేదు. త్వరలో లో అన్ని బంక్ లకు పెట్రోల్ సరఫరా అందుతుంది ప్రజలు ఆందోళన చెందవద్దు.

Read Also :
Shamim Mafi | ఇరాన్‌కు బాంబు, డ్రోన్ సప్లయ్.. లాస్ ఏంజెలెస్‌లో మహిళా వ్యాపారవేత్త అరెస్ట్
Basaveshwara Jayanti | సిరిసిల్ల కలెక్టరేట్లో ఘనంగా బసవేశ్వర మహారాజ్ జయంతి
Chandra Babu | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ, ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

