సిటీబ్యూరో, అక్టోబర్ 29: జూబ్లీహిల్స్ (Jubilee Hills) కాంగ్రెస్ (Congress) అభ్యర్థి నవీన్యాదవ్తో (Naveen Yadav) పాటు ఆయన కుటుంబ నేర చరిత్రపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నవీన్ యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలంతో పాటు బాబాయ్‌పై మధురానగర్ పీఎస్‌లో రౌడీషీట్లు ఉండటం, వారిని వారంరోజుల క్రితం పోలీసులు బైండోవర్ చేయడం తెలిసిందే. తాజాగా నవీన్ యాదవ్ అనుచరులు ఏకంగా సొంతపార్టీ కార్పొరేటర్ భర్తపై దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడం కలకలం రేపింది. సోమాజిగూడ డివిజన్ పరిధిలోకి వచ్చే ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్ కాలనీ సహా కొన్ని ప్రాంతాల ప్రచార బాధ్యతలను సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతాయాదవ్, ఆమె భర్త శ్రీనివాస్‌యాదవ్ చూస్తున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వర్గీయుడిగా ఉన్న శ్రీనివాస్‌యాదవ్ కొన్నిరోజులుగా డివిజన్లో నవీన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. కాగా నవీన్ యాదవ్ ప్రధాన అనుచరుడు సాయినాథ్ యాదవ్ మంగళవారం రాత్రి వనం శ్రీనివాస్‌యాదవ్‌తో వాగ్వాదానికి దిగాడు. ప్రచారానికి వస్తున్న వారి లిస్ట్‌లో ఎక్కువ పేర్లు రాస్తున్నావని, తక్కువమందిని తెచ్చి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నావంటూ గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కార్పొరేటర్ భర్త వనం శ్రీనివాస్ యాదవ్‌పై నవీన్ యాదవ్ అనుచరుడు సాయినాథ్ యాదవ్ చేయి చేసుకున్నాడు. దీంతో ఇరువర్గాల నడుమ బాహాబాహీ చోటుచేసుకుంది. సొంతపార్టీ కార్పొరేటర్ భర్తపైనే నవీన్ అనుచరులు దాడి చేయడంపై నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వారంరోజుల క్రితం సైతం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ వనం సంగీతాయాదవ్పై సొంతపార్టీ నేతగా ఉన్న గడ్డం శ్రీనివాస్ యాదవ్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడటంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు సైతం నమోదయ్యింది. తాజాగా ఎల్లారెడ్డిగూడలో నవీన్ యాదవ్ అనుచరుడి చేతిలో దానం నాగేందర్ ప్రధాన అనుచరుడిగా ఉన్న వనం శ్రీనివాస్ యాదవ్‌పై దాడి జరగడం పార్టీలోని వర్గపోరును మరోసారి బయటపడినైట్లెంది.