మణికొండ, ఏప్రిల్ 8: సాంప్రదాయ దక్షిణ భారత వంటకాలకు పూర్తిగా అంకితమైన, ఉత్సాహభరితమైన కొత్త భోజనశాల ‘నేటివ్ సౌత్ కిచెన్ అండ్ బ్రూహౌస్’ నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. నార్సింగి సర్కిల్ పరిధిలోని నార్సింగి ఓం కన్వెన్షన్ సమీపం లో ఈ రెస్టారెంట్.. స్థానికులతో పాటు ఐటీ హబ్‌లోని ఆహార ప్రియులకు, ఔత్సాహికులకు ఓ ప్రధాన భోజన కేం ద్రంగా మారనుంది. బుధవారం రెస్టారెంట్ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త జి.ప్రవీణ్‌రావు ‘నేటివ్ సౌత్ కిచెన్ అండ్ బ్రూహౌస్’ను అట్టహాసంగా ప్రా రంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళకు చెం దిన సాంప్రదాయ వంటకాలను.. స్థానికంగా లభించే తాజా కూరగాయలు, పదార్థాలతో తయారుచేసి అందించనున్నట్లు తెలిపారు. మెనూలో ప్రాంతీయ వైవిధ్యాలతో కూడిన ప్రాంతీయ ప్రధాన వంటకాలతో పాటు, ఆధునిక అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన వినూత్నమైన శాఖాహార, ఆరోగ్య సం బంధ వంటకాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రవీణ్‌రావు వెల్లడించారు.
నేటివ్ సౌత్ కిచెన్ కేవలం ఒక రెస్టారెంట్‌గా మాత్రమే కాకుండా.. కుటుంబాలు, స్నేహితులు, వృత్తి నిపుణులు ఒకచోట చేరి దక్షిణ భారత సం స్కృతిని, ఆహ్లాదకరమైన భోజనాన్ని ఆస్వాదించే ఒక సామాజిక వేదికగా నిలవాలనే లక్ష్యంతో ఏర్పా టు చేశామన్నారు. సాంప్రదాయ వంటకాలను మేళవి స్తూ, ప్రతి అతిథి విభిన్నమైన రుచులను ఆస్వాదించేలా సరికొత్త జ్ఞాపకాలను సృష్ఠించుకునేలా మేము ఒక వేదికను రూపొందిస్తున్నామన్నారు.

నేటివ్ సౌత్ కిచెన్ బ్రూహౌస్లో అందుబాటులో ‘నీరా’
తెలంగాణ ప్రజలు అత్యంత ప్రీతిప్రాయంగా ఇష్టపడే ఈత, తాటి నీరా అం దుబాటులోకి తీసుకువచ్చామని మెనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్‌రావు తెలిపారు. వీటితో పాటు తాజాగా తయారుచేసిన క్రాఫ్ట్ బీర్లు కూడా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ వంటకాలైన పచ్చిపులుసు, గుడాలు, తృణధాన్యాలతో కూడిన అనేక పప్పుదినుసుల పదార్థాలు కూడా రెస్టారెంట్లో అందుబాటులో ఉంటాయన్నారు. వేసవితాపంలోనూ నీరాను నగరవాసులకు అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ఎగ్జిక్యూటివ్ చెఫ్‌లు శివ షణ్ముగం, ఫజిష్, జనరల్ మేనేజర్ విజయ్ చక్రవర్తి, నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.