సిటీబ్యూరో, జూలై 28(నమస్తే తెలంగాణ): ఇండియన్ కౌన్సిల్ మెడిసినల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7న జాతీయ స్థాయి వెబినార్ జరగనున్నది. ఇంప్లీమెంటేషన్ రీసెర్చ్ అంశంపై జరిగే ఈ సదస్సులో ఐసీఎంఆర్‌కు చెందిన ల్యాబోరేటరీ సంస్థలు,
వైద్యారోగ్య శాఖలు, ఇతర పరిశోధన సంస్థలకు చెందిన సైంటిస్టులు, నిపుణులు హాజరుకానున్నారు. జీవక్రియలు, అనారోగ్య సమస్యల నియంత్రణలో అందుబాటులోకి వస్తున్న పరిశోధనలపై చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 15 మందికిపైగా నిపుణులు ఈ వెబినార్‌లో పాల్గొంటారని ఐసీఎంఆర్ వర్గాలు వెల్లడించాయి.