సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) ఇంటర్ ఫలితాలలో నారాయణ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని ఆ కాలేజీ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, శరణి నారాయణ, కోర్ కమిటీ సభ్యురాలు రమా నారాయణ.. విద్యార్థులను అభినందించారు. అత్యుత్తమ విద్యాప్రమాణాలకు నారాయణ పెట్టంది పేరని తమ విద్యార్థులు మరోసారి రుజువు చేశారని వారు అన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో పి.వర్షిణి 470 మార్కులకు 469 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కుతో చరిత్ర సృష్టించగా, 13 మంది 468 మార్కులు, 487 మంది 467 మార్కులు, 856 మంది 466 మార్కులు సాధించి విజయదుందుభి మోగించిందన్నారు.
అలాగే సీనియర్ ఎంపీసీలో 1000 మార్కులకు 13 మంది విద్యార్థులు 995 మార్కులు, 30 మంది 994 మార్కులు, 74 మంది 993 మార్కులు, 106 మంది 992 మార్కులు సాధించి నారాయణ సత్తాను చాటారన్నారు. బైపీసీ ఫస్ట్ ఇయర్లో 440 మార్కులకు 13 మంది 438 మార్కులు, 27 మంది 437 మార్కులు, 44 మంది 436 మార్కులు, 34 మంది 435 మార్కులు సాధించారని అన్నారు. బైపీసీ రెండో సంవత్సరంలో ఇద్దరు విద్యార్థులు 995 మార్కులు, నలుగురికి 984 మార్కులు అన్ని విభాగాలలో టాప్ స్కోర్‌ను సాధించారని విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
అదేవిధంగా జూనియర్ ఇంటర్ హెచ్.పి.జిలోనూ నారాయణ విజయప్రస్థానం కొనసాగిందన్నారు. 475 మార్కులకు గాను 470 మార్కులు ఒకరికి, 469 మార్కులు ఒకరికి, 468 మార్కులు నలుగురికి, 467 మార్కులు ఏడుగురు, సీనియర్ హెచ్.పి.జి విభాగంలో స్టేట్ టాప్ మార్కు 988 మార్కులు నారాయణ విద్యార్థి కైవశం చేసుకున్నారని తెలిపారు. అలాగే ముగ్గురు 985 మార్కులు, నలుగురు 984 మార్కులతో టాప్ మార్కులు సాధించారని, అన్ని విభాగాలలో నారాయణ విద్యార్థులే టాప్ మార్కులను కైవసం చేసుకున్నారని , ఈ స్థాయి ఫలితాలు నారాయణ తప్ప మరి ఏ ఇతర సంస్థ సాధించలేదని అన్నారు. ఈ సందర్భంగా రమా నారాయణ మాట్లాడుతూ..
జూనియర్ ఇంటర్లో ఆల్‌టైమ్ హయ్యస్ట్ మార్కులు వరుసగా రెండవ సారి నారాయణ సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఆరంభం నుంచి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌ను పటిష్టమైన మైక్రో షెడ్యూల్సగా రూపొందించి కాన్సెప్ట్యువల్ ఓరియంటేషన్లో విద్యాబోధన చేయడం వల్లనే విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించగలుగుతున్నారన్నారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన తమ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి నారాయణ విద్యా సంస్థల తరపున అభినందనలు తెలిపారు.