హైదరాబాద్ : పుడింగ్ పబ్ కేసు (Fooding Pub Case)లో పబ్ యజమాని, మేనేజర్ అభిషేక్, అనిల్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అభిషేక్, అనిల్ బెయిల్ కు నాంపల్లి కోర్టు (Nampally Court) నిరాకరించింది. ఇద్దరి పిటిషన్లను కోర్టు కొట్టిపారేసింది. బెయిలిస్తే దర్యాప్తు ప్రభావితం చేస్తారన్న పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించింది. మరోవైపు కొకైన్ పట్టుబడటంతో నిర్వాహకులు బాధ్యత వహించాలని పోలీసులు కోర్టుకు నివేదించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.
పుడింగ్ పబ్ లో కొకైన్ లభించడంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా..ఆ తర్వాత నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఇప్పటికే వారికి 14 రోజులపాటు రిమాండ్‌ను విధించిన విషయం తెలిసిందే.