Dasara Lucky Draw | కొండాపూర్, అక్టోబర్ 3: దసరా సంబురాలను రెట్టింపు చేస్తూ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్కీ డ్రాతో డబుల్ బొనాంజాను అందిస్తుంది. దశాబ్ద కాలంగా కొనసాగిస్తున్న లక్కీ డ్రాను మాదాపూర్‌లోని బిగ్ సీలో విజేతల వివరాలను గురువారం ఎంపిక చేశారు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, బిగ్ సీ, ఆల్మండ్ హౌస్ భాగస్వామ్యంతో, ప్రచార కర్తగా టీ న్యూస్, డిజిటల్ ప్రచార కర్తగా సుమన్ టీవీలుగా కొనసాగుతున్న బొనాంజా రెండో డ్రా బిగ్ సీలో సంస్థ ఏజీఎం ఎండీ యూసఫుద్దీన్ చేతుల మీదుగా సాగింది.
కాగా, డ్రాలో మొదటి బహుమతి (32 ఇంచుల కలర్ టీవీ) కేఎల్ఎం ఫ్యాషన్ మాల్లో షాపింగ్ చేసిన బీ రాజు, కూపన్ నం. 041563, రెండో బహుమతి బిగ్ సీలో కొనుగోలు చేసిన (స్మార్ట్ ఫోన్) మహేందర్, కూపన్ నం. 032512, మూడో బహుమతి మానేపల్లి జ్యువెల్లర్‌లో ఆభరణాలు కొనుగోలు చేసిన ఆర్ శిరీష, కూపన్ నం. 013609లు ఎంపికయ్యారు.
ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్న దసరా షాపింగ్ బొనాంజాను గ్రేటర్ ప్రజలు సద్వినియోగం చేసుకుని డబుల్ బొనాంజాను అందుకోవాలని, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేలలో వస్తున్న దసరా షాపింగ్ బొనాంజా ప్రకటనలను చూసి ఎంపిక చేసిన ఔట్లెట్లలో షాపింగ్ చేసి గిఫ్ట్‌లను గెలుచుకోవాలని నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే చీఫ్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) సీహెచ్ శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ జనరల్ మేనేజర్ ఎన్.సురేందర్ రావు, ఏడీవీటీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు రాజిరెడ్డి, రాములు పాల్గొన్నారు.