Dussehra Shopping | కంటోన్మెంట్, అక్టోబర్ 7: దసరా పండుగను పురస్కరించుకొని అటు షాపింగ్ సెంటర్లతో పాటు ఇటు సీజన్ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల నేతృత్వంలో కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజాలో ప్రతి రోజు లక్కీ డ్రా ద్వారా గెలుచుకుంటున్న బహుమతులు, కొనుగోలుదారులకు పండుగ జోష్‌ను తెస్తున్నాయి. ఎంపిక చేసిన అవుట్లెట్లలో షాపింగ్ చేస్తున్న కొనుగోలుదారులు తమకు అంది వచ్చిన కూపన్లను ఆయా అవుట్లెట్లలోని డ్రాప్ బాక్సుల్లో వేసేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు.
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల ఆధ్వర్యంలో కొనసాగుతున్న దసరా షాపింగ్ బొనాంజా ఆరో లక్కీ డ్రా సోమవారం కార్ఖానాలోని ఆరెంజ్ గ్రూపు ఆటో ప్రైవేట్ లిమిటెడ్ షోరూంలో కొనుగోలుదారుల సమక్షంలో ఉత్సాహంగా కొనసాగింది. ఈ లక్కీ డ్రాను ఆరెంజ్ గ్రూపు డైరెక్టర్ రాహుల్ యలమంచలి, సేల్స్ జనరల్ మేనేజర్ జి.సంతోష్, సేల్స్ సీజీఎం పూర్ణిమ, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం ఏజీఎం రాజిరెడ్డి, మేనేజర్ చరణ్ ఆనంద్‌లు నిర్వహించారు.
కార్ఖానాలోని ఆరెంజ్ గ్రూపు ఆటో ప్రైవేట్ లిమిటెడ్ షోరూంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆరెంజ్ గ్రూపు షోరూంలో కారును కొనుగోలు చేసిన పనబోయిన గోపాల్ యాదవ్ (కూపన్ నం. 009246) మొదటి బహుమతిగా టీవీ గెలుచుకోగా, ద్వితీయ బహుమతిగా స్మార్ట్ ఫోన్‌ను మానేపల్లి జ్యువెల్లర్స్లో షాపింగ్ చేసిన డి.రమేష్(కూపన్ నం.013248) తృతీయ బహుమతిగా గిఫ్ట్ వోచర్‌ను చర్మాస్‌లో షాపింగ్ చేసిన స్వయంతిక ధార (కూపన్ నం. 038487) గెలుచుకున్నారు. లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు త్వరలోనే వారికి వచ్చిన బహుమతులను అందజేయడం జరుగుతుంది.
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల నేతృత్వంలో దసరా బొనాంజాలో భాగస్వాములు కావడం గర్వంగా ఉంది. నగరంలో ఉన్న తమ షోరూంలలో బొనాంజా ధమాకాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో కార్ల కొనుగోలుదారులు ఆసక్తితో క్యూ కడుతున్నారు. నూతన ఆఫర్లతో ఈ పండుగ నేపథ్యంలో ఆరెంజ్ గ్రూపు షోరూంలలో కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ పండుగ ఆనందం రెట్టింపు అయ్యింది. తమ సంస్థకు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల ద్వారా నూతన ఉత్సాహం కలుగుతుంది. లక్కీ డ్రాలో విజేతులుగా నిలిచిన వారికి బహుమతులు మరింత పండుగ సంతోషాన్ని డబుల్ చేస్తుంది. లక్కీ డ్రా సందర్భంగా టాటా కర్వ్‌ను మార్కెట్లోకి విడుదల చేయడం సంతోషంగా ఉంది.
– రాహుల్ యలమంచలి, డైరెక్టర్, ఆరెంజ్ గ్రూపు ఆటో ప్రైవేట్ లిమిటిడ్
ఆరెంజ్ గ్రూప్‌లో దసరా పండుగ ముందే వచ్చింది. దసరా బొనాంజాలో భాగంగా కార్ల ఆఫర్లు కొనసాగుతుండటంతో కొనుగొలుదారులను ఆకట్టుకుంటుంది. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ దిన పత్రికల దసరా బొనాంజాలో భాగస్వామ్యవడంతో మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. తమ షోరూంలో అనేక ఫీచర్లతో ఉన్న కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. కొనుగోలుదారులు బొనాంజాలో పాల్గొని కూపన్లు అందుకున్నారు. ఇంకా రెండు రోజులు మిగిలి ఉండటంతో ఈ బొనాంజాలో ఎక్కువ మంది కార్లను కొలుగోలు చేసేందుకు మక్కువ చూపుతారనే విశ్వాసం కలుగుతుంది. గతంలో కంటే ఈసారి ఆరెంజ్ గ్రూప్ షోరూంలో కార్ల కొనుగోలుకు నగర ప్రజలు ఆసక్తి కనబరుస్తుండటం సంతోషంగా ఉంది.
– జి.సంతోష్, సేల్స్ జీఎం, ఆరెంజ్ గ్రూపు ఆటో ప్రైవేట్ లిమిటిడ్
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే లక్కీ డ్రా అంటే మార్కెట్లో మంచి నమ్మకం, గుర్తింపు ఉన్నది. ప్రతి సంవత్సరం ఆటోమోబైల్ సంస్థలు విరివిగా ఈ ప్రోగ్రామ్‌కు స్పాన్సర్స్‌గా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. ఆరెంజ్ గ్రూపు ఇచ్చే రాయితీలు కాకుండా అదనంగా నమస్తే తెలంగాణ వాళ్లు కూడా బహుమతులు అందజేయడం వల్ల కష్టమర్లకు అదనపు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది.
– బి.పూర్ణిమ, సేల్స్ సీజీఎం, ఆరెంజ్ టాటా ఆటోప్రైవేట్ లిమిటెడ్