మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 27: దరరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా-2025 8వ లక్కీ డ్రా కార్యక్రమం శనివారం సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని సీఎంఆర్ ఫ్యామిలీ మాల్లో ఘనంగా జరిగింది. దసరా ఉత్సవాల్లో భాగంగా కస్టమర్లను మరింత ఉత్సాహపర్చేందుకు లక్కీడ్రా బంపర్ ఆఫర్‌ను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే అందుబాటులోకి తెచ్చాయి.
సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే మార్కెటింగ్ విభాగం జీఎం ఎన్.సురేందర్‌రావు, సర్క్యులేషన్ డీజీఎం డీ.రాంరెడ్డి, ఏడీవీటీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజిరెడ్డి కలిసి 8వ లక్కీ డ్రాను తీశారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో మొదటి బహుమతి వినియోగదారుడు భాను ప్రకాశ్ ( కూపన్ నెంబర్ 026180)కు 32 ఇంచుల ఎల్ఈడీ టీవీ, రెండో లక్కీ డ్రాలో ఎన్.శ్రీజ ( కూపన్ నెంబర్ 025222)కు స్మార్ట్ ఫోన్, మూడో విజేతగా శాంతన ( కూప న్నెంబర్ 035753)కు గిప్ట్ ఓచర్, 4వ విజేతగా శీరిష ( కూపన్ నెంబర్ 026161) గిప్ట్ ఓచర్‌ను గెలుచుకున్నారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనంజాకు టైటిల్ స్పాన్సర్‌గా సీఎంఆర్ షాపింగ్ మాల్, మెయిన్ స్పానర్‌గా అల్లకాస్, గిఫ్ట్ స్పాన్సర్‌గా బిగ్‌సీ, పవర్డ్ బై ఆల్మండ్ హైజ్, ప్రోటీన్ పార్ట్నర్గా వెన్‌కాబ్ ఫ్రెష్ చికెన్, ఇతర స్పాన్సర్లుగా.. హర్షా టోయాటా, కున్ హుందాయ్, వరుణ్ మోటార్స్, మానేపల్లి జువెల్లరీస్, శ్రీ సిల్క్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెలివిజన్ పార్ట్నర్గా టీ న్యూస్, డిజిటల్ పార్ట్నర్గా సుమన్ టీవీ వ్యవహరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ సిబ్బంది పాల్గొన్నారు.
పదేళ్ల నుంచి లక్కీ డ్రాలో పాల్గొంటున్నా..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా లక్కీ డ్రాలో గత పదేళ్లుగా పాల్గొంటున్నాం. రోజురోజుకూ అభివృద్ధి చెందడం ఎంతో సంతోషంగా ఉంది. నమస్తే తెలంగాణ యజమాన్యం, సిబ్బంది మాకు ఎంతో సహకరిస్తూ.. సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ప్రతి సంవత్సరం నీతి, నిజాయితీగా బొనాంజా లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు. నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ప్రజల కోసం నిజాయితీగా వార్తలు రాస్తుంటారు.
ఈ రోజు మా ఫ్యామిలీ మాల్లో 8వ లక్కీ డ్రా నిర్వహించాం. ఇందులో నలుగురు విజేతలను ఎంపిక చేసి వారితో నేనే స్వయంగా ఫోన్లో మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలిపాను. తెలంగాణలోని సీఎంఆర్ ఫ్యామిలీ మాల్స్‌లో రూ.500కి మించి కొనుగోలుపై గిప్ట్‌లు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం మా సంస్థకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ దసరా, దీపావళి సందర్భంగా పలు ఆఫర్లను ప్రజల కోసం తక్కువ ధరల్లో నాణ్యమైన దుస్తువులను అందుబాటులోకి తీసుకొచ్చాం.
– సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఎండీ సత్యనారాయణ (సత్తిబాబు)
లక్కీ డ్రాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
గత పదేళ్లుగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే బొనాంజాలో షాపింగ్ చేస్తున్న కస్టమర్ల అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలను పాఠకులు ఎంతో ఆదరిస్తూ చదువుతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకొని ఈ బొనాంజాను ఏర్పాటు చేశాం. బొనాంజా ఆఫర్‌ను ఆదరిస్తున్న వారికి కృతజ్ఞతలు. ఈ లక్కీ డ్రాకు ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి గిప్ట్లను గెలుచుకోవాలి.
– నమస్తే తెలంగాణ సర్యూలేషన్ డీజీఎం ధర్మా రామ్‌రెడ్డి